13, ఏప్రిల్ 2011, బుధవారం


 లయకోల్పోవుచున్నారు....!!
తల్లిభారతికి అత్యంత ప్రేతిపాత్రులై,   శూదృలుగా పిలవబడిన దళిత బహుజనులను అసహ్యించుకోకుండా, లోలోపల వారిని దుర్భాషలాడకుండా నిద్రకుపక్రమించని పెద్దలు మన భారత సమాజంలో చాలామందే ఉన్నారనిపిస్తుంది.,  వీరి రోజువారి జీవన వ్యాపారంలో భాగంగా, తమతో కలసి నడుస్తున్న తమకు ఎదురు వస్తున్న తమకు అన్ని  రంగాలలో పోటీయిస్తున్న దళితులను, లోలోపల తీవ్రంగా దుయ్యబడుతూ,   దళితులది అసలు మానవజాతే కాదన్నట్టు,   సంకుచిత మనస్సుతొ,  దిగజారి అంధకార అధఃపాతాళానికిజారి,  ఎటుపోతున్నారు వీరు..?   ఏమౌతున్నారు వీరు....?  ఈ తల్లి భూమాతకు భారమై పోతున్నారు..    అమ్మ మనసు వికలమై.....!      అలిగిన అమ్మ,  తాను నడయాడిన,    వీరి    నట్టింటిని .....విడిచిపెట్టినదై...  ఏటో.... పయనిస్తున్నది....!   వీరిలో ఇసుమంతైనా అభిమానం పొడసూపలేదు. రాజ్యకాంక్ష, అధికార దాహం, సుఖభోగేచ్చ,   పీకలలోతు రొచ్చులో  పాపం... సూకరమూకతో మమేకమై......!     పందికొక్కుల కొలువులో గుంటనక్కల గుసగుసలు.......!    అగ్రహారం అడుగునేలలో భ్రష్టత్వపు బొరియలు, కుటిలత్వపు కన్నాలలో కాపురాలు....?               యిదిగో చదవండి.....!
వీరిలో మొండితనం,  ఆకతాయితనం, పిరికితనం,  అహంకారం, అర్దరహిత ఆవేశం, అమానుషత్వం నిత్యకృత్యమైపోయి  తమ జీవితాన్నె కబళించివేస్తున్నవి. వీరిలోని  కరడుగట్టిన స్వార్దంతో,  నిత్యంకృత్యమైన కపటత్వంతో,  నంగనాచినటనలు వీరిని సహజత్వానికి దూరంగా చేసి,  వీరి జన్యువులో మార్పులు కలుగజేస్తున్నాయి...!      .ఫలితం,  అణువు అణువులో జీర్నించుకుపోయిన అహం,  మానవ జన్మనెత్తిన వీరిని మానవత్వానికి దూరంగా,  దానవులతో పోల్చుకోవలసి వస్తుంది.    సహజత్వాన్ని కోల్పోయిన వీరిని కన్నతల్లే,  జగజ్జనని తానుకూడా పోల్చుకోలేదు.  అంతటా ఆవరించిన అమ్మకు అన్నీ తెలుసుకదా..!       ప్రాణికోటికి జన్మనిచ్చింది ఈ అమ్మఅవనీమాత అన్నది మరిచారు.  అమ్మ మనసు అంతటా ఆవరించి ఉంటుదన్నసత్యానికి దూరంగా పారిపోతున్నారు...!     సహజమైన ప్రకృతి సంపదల నడుమ, ప్రకృతిలో మమేకమై అభ్యసించి, సాధనలు నెరపి,  వేద సంస్కృతి పునాదిగా, తాము పొందిన వారసత్వం,  ఏ కారణంగా  నేడు తిరస్కారానికి గురిఔతున్నదో, ఏ కారణంగా వీరి జీవితం అసహజత్వానికి  ఆలవాలమౌతున్నదో,  మరే యితర సామాజికులలో యింతటి కపటం,  నటనల నైజం, కనిపించదు.   వీరు లయకోల్పోతునారు.  సహజత్వంతో శృతికలుపలెక సతమతమౌతునారు. 
తల్లి భారతికి అత్యంత ప్రీయమైన వారు ఎవరు..?   దగా చేయబడి, దీనావస్థలో ఆక్రోశిస్తున్నవారా?   దిక్కుతోచక, బక్కచిక్కిన బ్రతుకులతో ఆటలాడువారా.?    కన్నతల్లికి అందరూ ప్రియమైనవారే.    కానీ... ,  కన్నతల్లి ప్రేవు భంధం, ఎవరికై తపిస్తుంది..?     అహంకారుల అణచివేతలతో అలమటిస్తున్న తన సంతానాన్ని అపరకాళికయై రక్షించుకొంటుంది కదా....!.      
తల్లిభారతి గర్భాన జన్మించి, జాతిరత్నాలుగా వెలుగులునింపిన ఎందరో మహానుభావులు దిశానిర్దేశంచేసి, జాతికి జీవాన్నిపోసే జాతీయ భావాల రాజ్యాంగ కర్తల దిశానిర్దేశం ఎంతమాత్రం ఆమోదించలేక, మింగుడుపడక.....!   పతనపాచికల ప్రాపకంతో వ్యక్తిత్వాన్ని దిగజారుస్తూ,  అస్థవ్యస్థ అస్త్రప్రయోగానికి సమాజాన్నిగురిచేస్తూ, జాతి  జవసత్వాలను బలిచేయుచున్నారు....! 
                                                                                 ఇంకాఉంది........!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి