26, ఫిబ్రవరి 2011, శనివారం

శక్తి, దాని మూలాలు, దాని రూపము, దాని స్థితిగతులను శోధించటం అసాధ్యం!


          ఏ శక్తి ఈ సృష్టిస్థితిలయలకు కారణమో,  ఏ లయబద్దతతో ఈ అనంతకోటి సూర్య నక్షత్ర కూటములూ, గ్రహరాశులూ, వాని వాని కక్ష్యలలో  పరిభ్రమిస్తున్నాయో, ఏ లయలో రోదసిలోని సౌరకుటుంబము, మన భూమి పరిభ్రమిస్తున్నాయో, ఏ లయబద్దతతో భూమిపై రుతువులు ఏర్పడుతున్నాయో,  సముద్రాలలో అలలు,  వీచే గాలులు,  గాలిలోని ప్రాణవాయువు, జీవాణువులు లయబద్దంగా ఊపిరి తీసికొనటము, లయబద్దంగ నాడులు కొట్టుకోవటం, యావత్ సృష్టిలోని లయబద్దతకు కారణభూతమైన శక్తి,  దాని మూలాలు, దాని రూపము, దాని స్థితిగతులను  శోధించటం అసాధ్యం!  దానిని వర్ణించటము ఎవరి తరమూ కాదు. కాని   ఆ శక్తి  తరంగాలతో శృతికలిపే ప్రయత్నం చేయటం సాధకునికి సవాలుగా మిగిలి ఉన్నది. కొందరు   సాధకులు కృతకృత్యులైనా,  సాధించినది చాల స్వల్పమే.  వారు ఆ తరంగాల అంచుల  వద్ద  కలిగిన తన్మయత్వలో సర్వస్వం మరచి, అ లయను వర్ణించుటకు ప్రయత్నించి,  తాము అనుభవించిన యోగాన్ని, అనంతమైన విశ్వరూప దర్శనాన్ని,  కేంద్రీకృత శక్తిని,  యోగమాయను, మిధ్యాప్రపంచాన్ని, లోతుగా, పరిపూర్ణంగా అనుభవించుటకు వలయు పరిశ్రమ అసంపూర్ణమైనందున, అంచులవద్దనే ఆగిపోయినా,   తాము  అనుభవవించిన ఆ  అనంతమైన విశ్వారూపాన్ని,     అభివర్ణించుటలో విఫలమైనారు.  తాము అనుభవించినది గుర్తుచేసికోవటానికి ఎంతో ప్రయత్నించి విఫలమైనారు.  
              ఏ విధంగా తరంగ వైవిధ్యంతో కోట్లాది ప్రసారాల మాధ్యమాలు,  వ్యవస్థలు కనిపెట్టబడి, మానవాళికి ఉపకరిస్తున్నాయో! ఏ లయబద్దత విద్యుత్ తరంగాలను అదుపుచేస్తూ మానవాళికి ఉపకరిస్తున్నదో.   ఆ లయ లోనికి పయనించాలంటే..  శక్తి తరంగాలు  ప్రవహించే దైర్ఘ్యం, (Frequency) లోనికి పయనించి అందులో ఐక్యంకావాలి! శక్తి తరంగాలలోనికి  ఐక్యమైన క్షణం నుండి,  దేహ సంభందమైన అవసరాలు అంతమౌతాయి. జీవాణువుల జీవవ్యాపారానికి ఆవసరమైన శక్తి  సముపార్జనకు వలయు ప్రాణవాయువు, తదితర పోషకాల అవసరం లేకుండా, తనలోని అణునిర్మితచాలనను ఈ  సృష్టిస్థితిలయతో అనుసంధానం చేసికొంటాయి.  ఏవిధంగా తల్లి లయబద్దమైన జోలపాటతో శిశువు ఆకలిమరచి తన్మాయుదౌతాడో, ఎ అగోచర శక్తి తరంగాలు శూన్యంలోనుండి ప్రవహించి ఈ భూగోళాల స్థితిగతులను  అడుపుచేస్తున్నదో, ఆ శక్తి తరంగాల లయతో మమేకంకావడం  సాధకునికి  సాధనా వస్తువు!                
           నిశ్శబ్దంగా, నిర్మలంగా, శూన్యంగా, మేధస్సును కేంద్రీకరించి, చెవులు రిక్కించి వింటూ, లయతో మనం శృతికలిపి ప్రయత్నించాలి. నిర్మల నిరాకార నిర్గుణ నిశ్చల నైమిశారణ్యం  లోనికి  తధాత్మం చెందాలి.   మనపాత్రను శుభ్రంగ ఉంచుకొని, పరిపూర్ణమైన విశ్వాసంతో, నిష్కామ , నిష్కల్మష, నిర్వికార శూన్యతతో, ఖాళీగాఉంచుకొని, విధేయతతో వంగి,   చాకచక్యంగా పాత్రలోనికి ప్రవాహాన్ని పట్టుకోవాలి.  శక్తిప్రవాహం దిగువకే పారుతుంది (శూన్యతలోనికి)  అన్న సత్యాన్ని మరువరాదు.  మోకరిల్లి, చేతులుజోడించి అర్దించాలి! శిశువు రోదన తరంగాలలోని ఆకలి, నిద్ర, అసౌకర్యాదులను తల్లి ఎలా గ్రహిస్తుందో,  శిశువు ఆకలి తరంగాలు తల్లి క్షీరగ్రంధులను ఉత్తేజితంచేసే ప్రక్రియకూడా  ఒకరకమైన లయబద్దతకు నిదర్శనము !      అవిధేయత,  అహంకారము, అజ్ఞానము, అలసత్వము, అప్రయత్నముతో యిది అసాధ్యము.  నేను తలవంచను అంటే ?   ప్రవాహం ఎన్నటికీ నీవద్దకు రాదు...!    నీవే ప్రవాహం వద్దకు వెళ్ళాలి.!  
            లయబద్ద్తకు దూరంగా, కృత్రిమ జీవితం జీవిస్తే?   అపసవ్యదిశలో గాలిపటం? అపశ్రుతులతాళంతో చేసిన  నాట్యం వంటిది.   మన దేహం రూపుదాల్చిన మన తల్లిగర్భంతో మన యావజ్జేవితకాలం అవినాభావ సంభందం కలిగి ఉంటుంది.   మాతృప్రేమ, మాతృహృదయం ఎ లయకారణంగా జనిస్తున్నాయో,  ఖచ్చితంగా అదే లయ మనలను నియంత్రిస్తున్నది.    యింకాఉంది.....   

19, ఫిబ్రవరి 2011, శనివారం

సోదర సోదరీమణులారా !

భారతీయ అగ్రకులాలమీద స్వామి వివేకానందుని (నా ఐరోపాయాత్ర నుండి) వ్యాఖ్యలు:    (రామకృష్ణమఠం ప్రచురణ; ’సోదర సోదరీమణులారా’ అనే సాహిత్య సంకలనం నుండి గ్రహించబడినది.)

        ఆర్యులనుంచి నేనుద్భవించానని నువ్వెంత అరచినా,   ప్రాచీన భారత దేశాన్ని గురించి నువ్వు రాత్రింబవళ్ళు ఎంత సంకీర్తనం చేసినా, నీ జన్మకు నీవెంత విర్రవీగినా ఉత్తమ కులానికి చెందిన భారతీయుడా!  నువ్వు, నీ తోడి వారు,  ఇంకా బతికిఉన్నారనుకొంటున్నావా?   మీరంతా పదివేల సంవత్సరముల ముసలమ్మలు!    మీ పూర్వులు;  "నడయాడే శవాలని  యెవరిని నిందించారో, నిజంగా వారిలోనే యిప్పటికీ కొంచమో జీవశక్తి కనబడుతోంది.    నిజంగా "నడయాడేశవాలు’ మీరే! మీ    యిళ్ళు వాటిలోని వస్తుసామగ్రి పురాతన వస్తుప్రదర్శనశాలలో ప్రదర్శయోగ్యాలు! అవి అంత నిర్జీవాలుప్రాచీనాలుమీ పద్దతులను ప్రవర్తనలను, కదలికలను, జీవిత పోకడలను కళ్ళారా చూస్తున్నవాడు, తానేదో బొమ్మచెప్పే కథలను వినేట్లుగా భావిస్తాడుమీతో ప్రత్యక్ష్య పరిచయం తరువాత యింటికొచ్చి యెవరైనాతానంతకుపూర్వం ఒక పురాతన చిత్రశాలకు వెళ్ళి బొమ్మలను చూసివచ్చానా? అని సందేహంలో పడతాడు మాయాలోకంలో, ఉత్తమకులానికిచెందిన భారతీయులైన మీరే నిజమైన మాయాబొమ్మలు!  ఎడారిలోని యెండమావులు.   మీరు భూతకాలానికీ దాని వైవిధ్యాలకు ప్రతినిధులుమీరింకా కనబడటంఅజీర్నంవల్ల కలిగిన ఒక దారుణ పీడకల.   మీరు వట్టి శూన్యులు, భవిష్యత్తులోని ఒట్టి గాలిమూటలుస్వప్నలోకనివాసులట మీరింకా ఎందుకిక్కడ మసలుతున్నారు?   మీలో మాంసం నెత్తురు లేవువట్టి పురాతన భారతదేశ బొమికలగూళ్ళుమీరుమీరు త్వరగా దుమ్మై గాలిలొ ఎందుకు కలసిపోరుమీ కంకాళం వేళ్ళకు,  కొన్ని అమూల్యమైన రత్నపుటుంగరాలు ఉన్నాయిఅవి మీ పూర్వులు సంపాదించిపెట్టినవిమీ దుర్వాసనాభూయిష్టమైన శవాల కౌగిలింతలో,  ఎన్నో ప్రాచీన రత్నపేటికలు పదిలపరచబడ్దాయియిప్పటివరకు మీకువాటిని యితరులకు అప్పగించే సమయం చిక్కలేదుయిప్పుడు ఆంగ్లేయుల పరిపాలనలో, ఉచిత విద్యావిధానపు రోజుల్లో, ఈవెలుగులో వాటిని మీ వారసులకు అప్పగించండివీలైనంత త్వరలో పని చేయండిచేసి మీరు శూన్యంలో కలసిపొండిమాయమైపొండిమీ స్థానంలో నూతన హిందూదేశం ఉధ్బవించనివ్వండి. నూతన భారతదేశం తలయెత్తనివ్వండినాగలి చేతబట్టిన రైతుల గుడిసెల నుండి, బెస్తవారి పూరి పాకలనుండి, చెప్పులు కుట్టేవారి పూరిళ్ళనుండి, పాకీవాళ్ళ గుడిసెల నుండి నవీన భారత దేశం ఉద్భవించనీ!   వర్తకుని దుకాణం నుండి, పెసరట్టు అమ్ముకునేవాడి పెనం నుండి,  నూతన హిందూదేశం జన్మించనీకార్మాగారాలనుండివిపణీవీధులనుండి. తోటలనుండి, అడవులనుండి, గుట్టలనుండి, పర్వతాలనుండి, నూతన   భారతదేశం తలయెత్తనీ. జనసామాన్యం వేల సంవత్సరాలనుండీ అణగదొక్కబడి కిక్కురుమనకుండా సహిస్తూ వచ్చిందిఫలితంగా వారిలో అద్భుతమైన సహనశక్తి అలవడిందిఅచిరకాల దుఃఖానుభవ ఫలితంగా వారిలో అనంతమైన జీవశక్తి నెలకొందిగుప్పెడు ధాన్యంగింజలతో పొట్టపోసుకొని వారు ప్రపంచాన్నంతా తలక్రిందులు చేయగలరు.  వారికి చిన్న రొట్టెముక్క పెట్టండి, చాలు.  ఈ సమస్త ప్రపంచం వారి శక్తికి చాలదు.  వారు రక్తబీజుడి మాదిరి, అనంతమైన జీవశక్తి కలవారు. దీనికితోడు ప్రపంచంలో మరెక్కడా లభ్యంకాని పరిశుద్దమైన నైతిక జీవిత బలం కూడా వారికుంది.  అలాంటి శాంతి. త్రుప్తి, ప్రేమఏక ధాటిగా, నిశ్శబ్దంగా పనిచేసే అలాటి శక్తి, అవసర సమయాల్లో అ సింహబల ప్రదర్శనం - ఇవన్నీ మీకెక్కడ కనిపిస్తాయిప్రాచీన అస్తి పంజరాలైన మీముందు, మీ వారసులు, భవిష్యద్భారతదేశం ఉన్నాయి.  ఆభవిష్యత్భారతదేశ వాసులకు మీ రత్నపేటికలను, మీ రత్నపుటుంగరాలను అందించండి,  త్వరగా అందించి అంతర్దానమైపొండి!   కానీ అదృష్యులై ఉరికే మీ చెవులు మాత్రం రిక్కించి వినండి.  మీరు మాయమైన మరు క్షణమే భారతదేశ పునరుజ్జీవన ప్రారంభతూల్యారావం,  కోటి పిడుగుల ధ్వనికి సమానమై,  విశ్వాంతరాళంలో  ’గురు జయ!  గురు జయ!’ అని మారు మ్రోగే విజయనాదం ప్రతిధ్వనించటం ఆలకించండి.