21, ఏప్రిల్ 2011, గురువారం

Rogues Exposed....!


ఉద్దండధూర్త లోగుట్టు రట్టు...! 
         సనాతన ధార్మిక సమాజానికి వారసులమని చెప్పుకుంటూ, తదనుగుణంగా వేషభాషలతో అనుకరణలతో,  అద్భుతంగా నటిస్తూ!  అమాయక జన్నాన్ని నమ్మిస్తూ! కుట్రపూరితంగా  ప్రభుత్వఅధికారుల పంచన చేరి, వారికి వీర విధేయత కనబరుస్తూ, అట్లు నమ్మిస్తూ!  వారిపై పతన పాచికలను ప్రయోగించి, గుట్టు గుప్పిట్లోబిగించి....!  అవినీతిపరులుగా, అవకాశవాదులుగా, అసమర్ధులుగా, అహంకారులుగా తీర్చిదిద్ది,  వారి అధికారదండాన్నియధేచ్చగా తామే త్రిప్పేస్తూ,     ప్రభుత్వ కార్యాలయాలలో తమ  కర్రపెత్తనాన్ని  చెలాయిస్తూ, తమ పతనపాచికలను ప్రయోగించి, యావత్ వ్యవస్థను బ్రష్టుపట్టిస్తూ, తమ వికృత వాంచలను తీర్చుకుంటున్నారు.   
            వీరు నైతికపతనాతల్పంపై క్షణికానంద   దోలికలలూగుతూ, తాము తరతరాలుగా కోల్పోయిన విషయ వాంచలను,  ఈ ఒక్క తరంలోనే తీర్చుకునే తొందరలో హీనాతిహీనంగా దిగజారి,  వేలేత్తిచూపుతున్న  సమాజాన్ని కూడా లెక్కచేయకపోగా, పైగా  యావత్ సమాజ్జాన్నే దిగజార్సెందుకు నడుంకట్టి, తదనుగుణంగా వ్యక్తులపై తమ  పతనపాచికలను  ప్రయోగిస్తూ,    విశ్వప్రయత్నంచేస్తూ, అతివినయ ధూర్త లక్షణాలతో మనముందు వీర లెవెల్లో విన్యాసాలు చేస్తూ!  ఉచితంగా మనకు  సేవచేస్తున్నట్టు, వీరు ఆగర్భ ధూర్త దళారి గాళ్ళ ఉత్తమ వంశానికి చెందినట్టు,  తమనుతాము నిరూపించుకునేందుకు దీక్షపూని ఉన్నారు!       ఆవిధంగానైనా  దిగజారిన తమను, యికపై   వేలేత్తి  చూపెవారులేని సమాజాన్ని నిర్మించుకోవాలని,  సమాజంలోని  ప్రతి వ్యక్తీలోనూ  అపరాధ భావాన్ని  కలిగింఛి, తమను తాము కించపరచుకునేలాగ వారిలో  అవినీతికర చర్యలను ప్రోత్సహిస్తూ, దిగజార్చి, ఆపై  తాము నిర్భయంగా తమ  అనైతిక పతన జీవితాన్ని కొనసాగించాలని, తమదే పైచేయి సాధించుకోవాలని   తెగ ఆరాటపడుతున్నారు.
              వీరు చూపే మార్గం అధోగతిపధం.  అమాయకత్వం, ఏమరుపాటు,  పొరపాటు మిమ్మల్ని ఒక ఉద్దండదూర్తుడిచేతిలో కీలుబొమ్మగా, ఒక పావుగా మిగిల్చి,  మరో అహంకారియైన పై అధికారి పూజకు  పువ్వుగా వాడిపోక తప్పదు!      కాబట్టి యావత్ సమాజానికి హెచ్చరికగా, ఒక ఉద్దండదూర్తుడి లక్షణాలు ఎలా ఉంటాయో వర్ణిస్తూ, వ్యంగ్యపదాలతో వారి విన్యాసాలను మీముందు ఉంచుతున్నాను,    భాష వ్యవహారికశైలిలో  వ్యక్తపరచడంలో  కొంత లోపం కనిపించవచ్చు, అర్ధంచేసికొని విషయాన్ని గ్రహించగలరు.   ఆపై....!      బహుపరాక్...!  బహుపరాక్...!   

13, ఏప్రిల్ 2011, బుధవారం

'అంటు' వ్యాపించు దుర్గుణం

'అంటు' అనునది ఒకరి నుండి మరొకరికి  వ్యాపించు దుర్గుణం
                  హైందవ ధర్మశాస్త్రాలలో విసృతంగా పేర్కొనబడిన  ’అంటు’,  అన్న పదానికి అర్దమేమిటో, ’ అస్పృశ్యులు ’, అంటరానివారు, ’అంటు’ కలిగించువారు, అంటుసోకటం,  అంటుతొలగటం, ఈత్యాదిగా పేర్కొనబడిన ఈ పదాలు ఎన్నోప్రశ్నలకు దారితీసినా, నేటివరకూ శాస్త్రీయమైన, అర్దవంతమైన జవాబులు లభించలేదనే చెప్పాలి.  హైందవధర్మంలో పేర్కొన్న వివరణలో  నిమ్నజాతివారి నీచపు ఆహార అలవాట్లు, వారిలోని  దుర్గుణాలు, వారి స్పర్శమాత్రంగానే ఇతరులకు సోకుతాయి,  వారు సమీపించినా, వారితో సన్నిహితంగా మెలగినా, పవిత్ర భగవత్ సేవకు భంగం వాటిల్లుతుంది (యజ్ణ, యాగాదులు అపవిత్రం అవుతాయి)  సృష్టిలోని సకల జీవజాలాలలో మానవ జన్మ అత్యున్నతమైనదిగా శాస్త్రాలు తెలుపుతున్నయి,   హైందవధర్మ సూత్రాలు ముఖ్యంగా  శక్తిని ఉపాసనచేయుట, ప్రకృతిని, పంచభూతాలను, సూర్యచంద్రులు, భూమ్యాకాశాలు, గాలి, నీరు ఈత్యాది సహజ వనరులే వివిధ శక్తి స్వరూపాలుగా, కొలవటం జరుగుతుంది.   సృష్టిలో, సకలప్రాణులను, వృక్ష, జంతుజాలములకు జీవనాధారమై, సమంగా ఆవరించియున్న ఈ యావత్ శక్తికి ఏవిధమైన తారతమ్యములున్నట్టు కనబడదు.  ఈ సృష్టిలోని శక్తిని భగవత్ స్వరూపంగా ఆరాధిస్తున్న సంధర్భంలో సక్షాత్తు ఆ భగవంతునిలోలేని తారతమ్యం, కొందరు మానవులలో విభిన్నంగా గొచరించడం, వేదార్దాన్ని తప్పుగా నిర్వచించటమేనన్నది సందేహంలేదు.
                    కారణమేమైనా,   అస్పృశ్యతా దురాచారం భారతజాతీయ సమైక్యతకు తీరని నష్టం కలిగించగా.  భారతీయ సమాజం బలహీనమై, దేశం దాస్యంలోనికి నెట్టివేయబడింది.  నేడు స్వాతంత్ర్యం సిద్దించినా,  సమాజంలో జాతీయ భావాలు పెంపొందలేదు. తిరిగి జాతి నిర్వీరమైపోయేందుకు సమయం ఆసన్నమైనది. అగ్రవర్ణ అధిపత్యాన్ని వదలుకోలేని కొందరు పెద్దలు, రాజ్యంగ హక్కుల సార్వజనీనతను ఆమోదించలేక, బడుగు బలహీనవర్గాలకు చెందిన మొదటితరం యువత చాల స్వల్ప సంఖ్యలో, ఇప్పుడిప్పుడే, ఉద్యోగాల్లో  ప్రవేశిస్తూ,  పౌరపాలన, నిర్వహణను అవగాహనచేసికొంటూ, అద్యయనం చేస్తూ, స్వచ్చమైన, స్థిరమైన అభిప్రాయములు కలిగి, అవినీతికి తావులేని స్వచ్చమైన సేవలు అందించేందుకు సన్నద్దమైన తరుణంలో,  మొదటితరం వారైనందున తమలో సహజంగా అమాయకత్వాన్ని కలిగి ఉండటం.   దీనిని అవకాశంగా తీసికొని,  కొందరు అగ్రవర్ణ ధూర్త దళారిగాళ్ళు, సహకరించే నెపంతో,   వీరితో సాన్నిహిత్యాన్ని నటిస్తూ, తమ  పతనపాచికలు వీరిపై  ప్రయోగిస్తూ వీరిని అవినీతి రొంపిలోనికి లాగుతున్నారు.  ఈ అగ్రవర్ణ ధూర్తులు, బడుగువర్గాల భాగస్వామ్యాన్ని సహించలేక,    పరిపాలనపై తమ పట్టును కోల్పోవు ప్రమాదాన్ని ఊహిస్తూ, దీపముండగానే ఇల్లు చక్కబేట్టుకోవాలన్న ఏకైక లక్ష్యంతో,  తమ అస్థవ్యస్థ అస్త్రప్రయోగంలో భాగంగా,  విధివిధానాల అమలులో అగోచర ఆటంకాలు సృష్టిస్తూ, అవినీతిని  వ్యవస్థీకృతం చేయుచూ, అర్దరహితంగా పాతకధనాన్ని పెంచి పోషిస్తున్నారు. సమాజాన్ని అస్థవ్యస్థం చేయుటే ద్యేయంగా ముందుకు సాగుతున్న ఈ ధూర్తుల కుతంత్రమే ఈ  అవినీతిరోగ క్రిములను పరివ్యాప్తిచేయు ప్రక్రియ.  అవినీతి  ’ఆంటు’. రోగాన్ని  ప్రజల ప్రవృత్తిలోనికి ప్రవేశపెట్టుట, వారు లంచావతారం ఎత్తటం,  ధూర్తగణం గుప్పిట్లో గుట్టుగా నలిగి, అపరాధభావం, అభద్రతా భావంతో,  పిరికితనం పొడసూపి ధూర్తగణం చెప్పుచేతల్లో ఉండటం!  ఒహొ, ఇది  ఎంతటి దివ్యమైన ఎత్తుగడ!  వీరిది ఎంతటి దుర్నీతి?    భగవాన్ ఇది జాతికి  ఎంతటి దౌర్భాగ్యదశ!  . 
                    హైందవధర్మ ప్రతినిధులుగా, తాము ప్రధమంగా సదాచార పరాయణులై, యువతకు ఆదర్శప్ర్రాయంగా నడచుకోంటూ, దిశానిర్దేశం చేయవలసిన పెద్దమనుషులు, కుతంత్రములతొ, నూతన సామాజికులలో అవినీతికర ప్రవృత్తిని పెంచి, అనైతిక జీవన విధానాన్ని, దుర్వ్యసనాలను అలవరచి, కుల మత భేదభావాలను ప్రోత్సహించి. వారు తమ వేలితో  తమ కళ్ళ్నే  పొడుచుకునేవిధంగా, వారిలో ఒకరిపై ఒకరికి విరోధభావాలను కలిగించి, ఒకరి వెనుక ఒకరు గోతులు తీసికొంటూ, ఒకరిపై ఒకరు కత్తులు నూరుతూ, ఒకరి పతనాన్ని ఒకరు కాంక్షిస్తూ, తమ జీవితాలను అస్థవ్యస్థం చేసికొంటూ, తెరవెనుక అగొచరంగా చేస్తున్న తమ అస్థవ్యస్థ అస్త్రప్రయోగాన్ని, కుతంత్రాన్ని ఎవరూ గుర్తించలేకపోతున్నారు.  ఈ పరిస్థితులు నేడు నిరాశాజనకంగా రూపుదాల్చి, యువతలో జాతీయభావాలు, దేశభక్తీ, సేవాభావం, సమైక్యభావం, సమదృష్టి, అడుగంటిపోయి,  స్వార్దపూరిత ధోరణులు,  అర్దరహిత పోకడలకు ఆకర్షితులై, అటు యిటుకాని త్రిశంకుస్వర్గంలో విహరిస్తూ, ఉత్కృష్ఠపరంపరలకు పుట్టినిల్లైన భారతావని ముద్దుబిడ్డలమన్న విషయాన్ని పూర్తిగా విస్మరించినారు.   దేశం అత్యంత క్లిష్ఠపరిస్థితిలో ఉన్నా ఎంతమాత్రం తమలో ప్రతిస్పందనలేక, జాతీయ భావాలు కలుగక,  నిర్వీర్య, నిస్తేజ, నైరాశ్య స్థితిలో స్థంభించిపోయారు. వారిలో నైతిక సత్ప్రవర్తన కొరవడి, అనైతికత ఒరవడిలో కొట్టుకుపోతున్నారు. ప్రతివారిలో అపరాధభావం కలిగి ఉండటం, దుర్మార్గాలను ఎండగట్టే, ఎదిరించే నైతిక స్థైర్యం కొరవడటం, వారిలో పిరికితనం ఆవహించటం (guilty consiousness in every individual, so that, no one has the morality and courage to raise alarm against wrongdoers), ప్రతి వ్యక్తీలో అభద్రతాభావం ఏర్పడటం అనుమానాస్పద ఆలోచనా సరళి ఏర్పడి, సంకుచిత ధోరణి పొడచూపటం (insecure feeling among individuals, leading to mistrust and narrow outlook) ,  తమమద్య  దూరాన్ని పెంచుకొని,  అంతులేని అగాధంలోనికి జారిపోతున్నారు.  ఈ పరిస్థితులకు తెరవెనుక సూత్రధారులైన  ’ఉద్దండధూర్తగణం’, పెద్దమనుషులు, తమ పాచికలు పారినందుకు, తమ పబ్బంగడిచిపోతున్నందుకు వికృతమైన ఆనందాన్ని పొందుతున్నారు. 
          యావత్ ప్రపంచ ప్రజలలో వివక్షతాదృక్పధం అదృశ్యమైపోతున్నా, విశాల భావాలతో ముందుకు  కదలుతున్నా, మానవాళి యావత్తూ ఒకరినొకరు అర్దంచేసికొనేదిశగా, సమదృష్ఠితో, సహకార భావంతో, ప్రగతిపధం వైపుగా పయనిస్తున్న ఈ నూతన యుగంలో,  భారతీయ సమాజంలో, తద్విరుద్దంగా, తమలో ఇంకా భేదభావాలు విడనాడలేక, సంకుచిత మనస్కులై, అగ్రవర్ణ ఆధిపత్యాన్ని విడనాడలేక, తెరవెనుక అధికారాన్ని రుచిమరిగిన పెద్దలు, తిరిగి తెరవెనుక తంత్రాలతో, జాతిని అస్థవ్యస్థంచేస్తూ, ఒకవైపు విధివిధానాల అమలును ఆటంకపరుస్తూ, మరోవైపు  యావత్ సమాజాన్ని అనైతికత రొచ్చులోనికి లాగి, తమ దుర్మార్గాన్ని వేలెత్తిచూపేందుకు ధైర్యంచేయలేని  బలహీనతను,  భీరుత్యాన్ని, భయాన్ని వ్యాపింపజేస్తున్నారు.  ఇది, కుట్రపూరితం.  ఇది, ప్రజాస్వామ్యం వెలిగిస్తున్న ప్రచండ కాంతిలో, తెరమరుగున జరుగు అగోచర నిశాచర పిశాచ పీడ!  ఆ దగుల్బాజీ ధూర్తదొంగ మొహాల కార్యకలాపాలు ఏమిటి?  దివాలాకోరు దిగుడుకళ్ళ దేభ్యంగాళ్ళు ఎక్కడ?  వారి ఉనికి ఎక్కడ?  వారి నైజం ఏమిటి?  వారి చతురఅంగ సమర్దమర్దనా  హస్తకళా నిపుణ గణ       వారి నాకటం నాటకం ఎవరిపైగురి పెడతారు? వీరి పతనపాచికల ప్రయోగానికి బలిఅయ్యేదెవరు?   వీరి పన్నాగాలకు పావులుగా పనిచేస్తున్న మొరటు, మూర్ఖ, మొద్దబ్బాయిలు ఎవరు?  వీరి   పతన ప్రతిభకు మెచ్చి, తమ దుగ్ద శరీరాన్ని యదేచ్చగా అప్పగిచ్చి, సుఖ భోగేచ్చను తీర్చు మాయనిమచ్చల మదపిచ్చ ఎవరు?                             ..............ఇంకాఉంది !

 లయకోల్పోవుచున్నారు....!!
తల్లిభారతికి అత్యంత ప్రేతిపాత్రులై,   శూదృలుగా పిలవబడిన దళిత బహుజనులను అసహ్యించుకోకుండా, లోలోపల వారిని దుర్భాషలాడకుండా నిద్రకుపక్రమించని పెద్దలు మన భారత సమాజంలో చాలామందే ఉన్నారనిపిస్తుంది.,  వీరి రోజువారి జీవన వ్యాపారంలో భాగంగా, తమతో కలసి నడుస్తున్న తమకు ఎదురు వస్తున్న తమకు అన్ని  రంగాలలో పోటీయిస్తున్న దళితులను, లోలోపల తీవ్రంగా దుయ్యబడుతూ,   దళితులది అసలు మానవజాతే కాదన్నట్టు,   సంకుచిత మనస్సుతొ,  దిగజారి అంధకార అధఃపాతాళానికిజారి,  ఎటుపోతున్నారు వీరు..?   ఏమౌతున్నారు వీరు....?  ఈ తల్లి భూమాతకు భారమై పోతున్నారు..    అమ్మ మనసు వికలమై.....!      అలిగిన అమ్మ,  తాను నడయాడిన,    వీరి    నట్టింటిని .....విడిచిపెట్టినదై...  ఏటో.... పయనిస్తున్నది....!   వీరిలో ఇసుమంతైనా అభిమానం పొడసూపలేదు. రాజ్యకాంక్ష, అధికార దాహం, సుఖభోగేచ్చ,   పీకలలోతు రొచ్చులో  పాపం... సూకరమూకతో మమేకమై......!     పందికొక్కుల కొలువులో గుంటనక్కల గుసగుసలు.......!    అగ్రహారం అడుగునేలలో భ్రష్టత్వపు బొరియలు, కుటిలత్వపు కన్నాలలో కాపురాలు....?               యిదిగో చదవండి.....!
వీరిలో మొండితనం,  ఆకతాయితనం, పిరికితనం,  అహంకారం, అర్దరహిత ఆవేశం, అమానుషత్వం నిత్యకృత్యమైపోయి  తమ జీవితాన్నె కబళించివేస్తున్నవి. వీరిలోని  కరడుగట్టిన స్వార్దంతో,  నిత్యంకృత్యమైన కపటత్వంతో,  నంగనాచినటనలు వీరిని సహజత్వానికి దూరంగా చేసి,  వీరి జన్యువులో మార్పులు కలుగజేస్తున్నాయి...!      .ఫలితం,  అణువు అణువులో జీర్నించుకుపోయిన అహం,  మానవ జన్మనెత్తిన వీరిని మానవత్వానికి దూరంగా,  దానవులతో పోల్చుకోవలసి వస్తుంది.    సహజత్వాన్ని కోల్పోయిన వీరిని కన్నతల్లే,  జగజ్జనని తానుకూడా పోల్చుకోలేదు.  అంతటా ఆవరించిన అమ్మకు అన్నీ తెలుసుకదా..!       ప్రాణికోటికి జన్మనిచ్చింది ఈ అమ్మఅవనీమాత అన్నది మరిచారు.  అమ్మ మనసు అంతటా ఆవరించి ఉంటుదన్నసత్యానికి దూరంగా పారిపోతున్నారు...!     సహజమైన ప్రకృతి సంపదల నడుమ, ప్రకృతిలో మమేకమై అభ్యసించి, సాధనలు నెరపి,  వేద సంస్కృతి పునాదిగా, తాము పొందిన వారసత్వం,  ఏ కారణంగా  నేడు తిరస్కారానికి గురిఔతున్నదో, ఏ కారణంగా వీరి జీవితం అసహజత్వానికి  ఆలవాలమౌతున్నదో,  మరే యితర సామాజికులలో యింతటి కపటం,  నటనల నైజం, కనిపించదు.   వీరు లయకోల్పోతునారు.  సహజత్వంతో శృతికలుపలెక సతమతమౌతునారు. 
తల్లి భారతికి అత్యంత ప్రీయమైన వారు ఎవరు..?   దగా చేయబడి, దీనావస్థలో ఆక్రోశిస్తున్నవారా?   దిక్కుతోచక, బక్కచిక్కిన బ్రతుకులతో ఆటలాడువారా.?    కన్నతల్లికి అందరూ ప్రియమైనవారే.    కానీ... ,  కన్నతల్లి ప్రేవు భంధం, ఎవరికై తపిస్తుంది..?     అహంకారుల అణచివేతలతో అలమటిస్తున్న తన సంతానాన్ని అపరకాళికయై రక్షించుకొంటుంది కదా....!.      
తల్లిభారతి గర్భాన జన్మించి, జాతిరత్నాలుగా వెలుగులునింపిన ఎందరో మహానుభావులు దిశానిర్దేశంచేసి, జాతికి జీవాన్నిపోసే జాతీయ భావాల రాజ్యాంగ కర్తల దిశానిర్దేశం ఎంతమాత్రం ఆమోదించలేక, మింగుడుపడక.....!   పతనపాచికల ప్రాపకంతో వ్యక్తిత్వాన్ని దిగజారుస్తూ,  అస్థవ్యస్థ అస్త్రప్రయోగానికి సమాజాన్నిగురిచేస్తూ, జాతి  జవసత్వాలను బలిచేయుచున్నారు....! 
                                                                                 ఇంకాఉంది........!!