21, ఏప్రిల్ 2011, గురువారం

Rogues Exposed....!


ఉద్దండధూర్త లోగుట్టు రట్టు...! 
         సనాతన ధార్మిక సమాజానికి వారసులమని చెప్పుకుంటూ, తదనుగుణంగా వేషభాషలతో అనుకరణలతో,  అద్భుతంగా నటిస్తూ!  అమాయక జన్నాన్ని నమ్మిస్తూ! కుట్రపూరితంగా  ప్రభుత్వఅధికారుల పంచన చేరి, వారికి వీర విధేయత కనబరుస్తూ, అట్లు నమ్మిస్తూ!  వారిపై పతన పాచికలను ప్రయోగించి, గుట్టు గుప్పిట్లోబిగించి....!  అవినీతిపరులుగా, అవకాశవాదులుగా, అసమర్ధులుగా, అహంకారులుగా తీర్చిదిద్ది,  వారి అధికారదండాన్నియధేచ్చగా తామే త్రిప్పేస్తూ,     ప్రభుత్వ కార్యాలయాలలో తమ  కర్రపెత్తనాన్ని  చెలాయిస్తూ, తమ పతనపాచికలను ప్రయోగించి, యావత్ వ్యవస్థను బ్రష్టుపట్టిస్తూ, తమ వికృత వాంచలను తీర్చుకుంటున్నారు.   
            వీరు నైతికపతనాతల్పంపై క్షణికానంద   దోలికలలూగుతూ, తాము తరతరాలుగా కోల్పోయిన విషయ వాంచలను,  ఈ ఒక్క తరంలోనే తీర్చుకునే తొందరలో హీనాతిహీనంగా దిగజారి,  వేలేత్తిచూపుతున్న  సమాజాన్ని కూడా లెక్కచేయకపోగా, పైగా  యావత్ సమాజ్జాన్నే దిగజార్సెందుకు నడుంకట్టి, తదనుగుణంగా వ్యక్తులపై తమ  పతనపాచికలను  ప్రయోగిస్తూ,    విశ్వప్రయత్నంచేస్తూ, అతివినయ ధూర్త లక్షణాలతో మనముందు వీర లెవెల్లో విన్యాసాలు చేస్తూ!  ఉచితంగా మనకు  సేవచేస్తున్నట్టు, వీరు ఆగర్భ ధూర్త దళారి గాళ్ళ ఉత్తమ వంశానికి చెందినట్టు,  తమనుతాము నిరూపించుకునేందుకు దీక్షపూని ఉన్నారు!       ఆవిధంగానైనా  దిగజారిన తమను, యికపై   వేలేత్తి  చూపెవారులేని సమాజాన్ని నిర్మించుకోవాలని,  సమాజంలోని  ప్రతి వ్యక్తీలోనూ  అపరాధ భావాన్ని  కలిగింఛి, తమను తాము కించపరచుకునేలాగ వారిలో  అవినీతికర చర్యలను ప్రోత్సహిస్తూ, దిగజార్చి, ఆపై  తాము నిర్భయంగా తమ  అనైతిక పతన జీవితాన్ని కొనసాగించాలని, తమదే పైచేయి సాధించుకోవాలని   తెగ ఆరాటపడుతున్నారు.
              వీరు చూపే మార్గం అధోగతిపధం.  అమాయకత్వం, ఏమరుపాటు,  పొరపాటు మిమ్మల్ని ఒక ఉద్దండదూర్తుడిచేతిలో కీలుబొమ్మగా, ఒక పావుగా మిగిల్చి,  మరో అహంకారియైన పై అధికారి పూజకు  పువ్వుగా వాడిపోక తప్పదు!      కాబట్టి యావత్ సమాజానికి హెచ్చరికగా, ఒక ఉద్దండదూర్తుడి లక్షణాలు ఎలా ఉంటాయో వర్ణిస్తూ, వ్యంగ్యపదాలతో వారి విన్యాసాలను మీముందు ఉంచుతున్నాను,    భాష వ్యవహారికశైలిలో  వ్యక్తపరచడంలో  కొంత లోపం కనిపించవచ్చు, అర్ధంచేసికొని విషయాన్ని గ్రహించగలరు.   ఆపై....!      బహుపరాక్...!  బహుపరాక్...!   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి