21, మార్చి 2011, సోమవారం

Curry of Raw Papayya పచ్చి బొప్పాయికాయ కూర


పచ్చిబొప్పాయికాయ కూర (Curry of Raw Papayya)
                  పచ్చిబోప్పయికాయ చర్మం వలిచాక, చిన్నముక్కలుగాకాని, తురిమికాని తయారుగా  ఉంచుకొని,  పోపు వేసి, (నేతితో పోపువేసి,  పోపులో   మినపప్పు   కలిస్తే రుచిగా ఉంటుంది) పోపులో కొద్దిగా అల్లంవెల్లుల్లిపేస్టు  కలుపుకొని,    ఎందుకొబ్బరి తురుము,  ఉల్లి, టమోటా ముక్కలు, ఉప్పుకారంపసుపు,  వేసి వేగాక, ఆపై  బొప్పాయి తురుమును కలుపుకొని,  గరిటెతో కలుపుతూ అయిదు నిమిషాలు  వేపాలి,  తరువాత కొద్దిగా నీళ్ళు చల్లి, మూతపెట్టి ఉడికించాలి,  అయిదారు నిమిషాలు ఉడికాక, కొత్తిమీరచల్లి మూతపెట్టి ఉంచి, వేడిగా వడ్డించాలి.  చపాతీ  లేక పూరీతో  పచ్చిబొప్పాయికూర బాగుంటుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి