11, మార్చి 2011, శుక్రవారం

కులీన బ్రాహ్మణుల వంశమర్యాదలు నీటకలిసిపోతున్నాయి!


 కులీన  బ్రాహ్మణుల వంశమర్యాదలు నీటకలిసిపోతున్నాయి! 
( శ్రీ వివేకానంద సాహిత్య సంకలనం, 'సోదరసోదరీమణులారా", అనే శీర్షిక కలిగిన రామకృష్ణమఠ ప్రచురణ గ్రంధం  నుండి గ్రహించబడినది.)                 
        భారత సంస్కృతీ పరంపరల గొప్పదనం  సోపానంగా సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందిన  పెద్దలు,  తాము స్వయంగా పాశ్చ్యాత్త  పోకడలనే అవలంభిస్తూ ఉండడం మనం గమనించాలి ! వర్ణవ్యవస్థలో అత్యున్నత స్థానానికి చెందిఉండీ, సమాజ కల్యాణానికి తాము నిర్వహించవలసిన భాద్యతలను విస్మరించి, అవకాశవాద ధోరణితో అధోగతి మార్గాలను సూచించే ధూర్త బ్రహ్మణుల మూలంగా నేటిమన సమాజం యావత్తు, అస్తవ్యస్థంగా రూపుదాల్చింది..!   ఈ విషయంలో  శ్రీ  స్వామీ వివేకానందుని భావాలను పరిశీలిద్దాం 
                                                                        ----------------------
                 దుర్బల దేశస్థుల సంతానమైనవారు ఇంగ్లండులో జన్మించివుంటే,  యవనులమనికాని  (గ్రీకులు), బుడతకీచ్గులమనికాని (పోర్చుగీసు),    స్పెయిన్ దేశస్తులమనికాని యధాతదంగా చెప్పక,    తాము ఆగ్లేయులమని  చెప్పుకోవడం నేను చూసాను!     అందరూ బలవంతులవైపే సాగుతుంటారు,    వైభావోపెతులైనవారి వైభావప్రకాశం  ఎలాగైనా తమపైనపడి ప్రతిఫలించాలని,   అంటే;    ఎరవు సొమ్ములతో ప్రకాశించాలని...!        దుర్భలులందరికీ యిదే కోరిక,   భారతీయులు యురోపెయను వేషభాషలను తాల్చుట  చూసినప్పుడు నేనిలా అనుకొంటాను,   నిరక్షరకుక్షులు,    దరిద్రులు,       అదఃపతితులు  ఇన భారతీయులతో సజాతీయతను సంభందాన్ని ఆమోదించుటం వారికి సిగ్గుగుగా ఉంది కాబోలు!       పద్నాలుగు శతాబ్దాలనుండీ  హైందవరక్తం తో పోషించబడ్డ  'పార్సీ',    నేడు, సజాతీయుడు  'నేటివ్' కాడు!      జాతిహీనులైన బ్రాహ్మణమ్మన్యుల బ్రహ్మణ్య గౌరవ దంభాల ముందు,    కులీన  బ్రాహ్మణుల వంశమర్యాదలు నీటకలిసిపోతున్నాయి!   కౌపీనమాత్ర ధారులై ఉండే,   లేక;   కటిప్రదేశాన్నమాత్రం కప్పుకొని ఉండే - అజ్ఞా,  మూర్ఖ నిమ్నజాతుల వారంతా అనార్యులని పాచ్యాత్తులు మనకు భోధించి  ఉన్నారు,  ఇక వారెంతమాత్రం మనవారు కాదు! మనలోని వారు కాదు! 
           ఓ భారతీయులారా, యితరుల వెంటపడి ప్రాకులాడే ఈలాంటి పరానువాడంతో, ఈ పరానుకరణతో ఏఎ పారతంత్ర్యంతో ఈ దాస్య దుర్భాల్యంతో, ఈ నీచ నిండిత క్రుర్యముతో ఈసంపదలతోనేనా, విజ్ఞాన గౌరవ  శిఖిరాల నదిరోహింప తలస్తున్నారా! మహోచ్చాదికారాన్ని పొందదలచు  కొన్నారా?  వీరభోగ్యమైన స్వాతంత్ర్యం మీ లజ్జాకర భీరుత్వంచే ఎన్నడైనా మీకు లభిస్తుందా? ఓ భారతజననీ! నీ సతీత్వాదర్షం సీత - సావిత్రి - దమయంతి - అనేమాట మరువద్దు; సర్వసంఘ పరిత్యాగి, యతీశ్వరుడు, ఇన శంకరుడు, - ఉమమహేశ్వరుడు   - నీకు అరాధ్యుదనేమాట  మరువద్దు, నీ వివాహానికి , నీ ధనానికి, నీ జీవనానికి పరమార్థం తుచ్చవిషయసుఖం కాదనేమాట మరువద్దు! యజ్ణనారాయనునకు ఆహుతిఅయ్యే  నిమిత్తం, జన్మించాననేమాట మరువద్దు! నీ సంమజం అనంత జగన్మాత్రుత్వానికి, ప్రతిబింబమనేమాట మరువద్దు!   నిమ్నాజాతులనబడే మాలమాదిగలు - దీనులు, దరిద్రులు - అజ్ఞానులు, నిరక్షరాస్యులు, నీ తోదబుట్టినవారనేమాట మరువద్దు! ఓ వీరభారతమాతా, ధైర్యం విడనాడకు.  ఓ వీరభారత పుత్రా, ధైర్యం విడకు, 'నేను భారతీయుడిని, ప్రతి భారతీయుడు నా సోదరుడని ప్రకటించు.  జీర్నవస్త్రధారివైన కటిమాత్ర వస్త్రధారివైన నీవూ సగర్వంగా ఎలుగెత్తి ఇలా ఘోషించు 'భారతీయుడు నా సోదరుడు, భారతీయుడు నా ప్రాణం,  భారతీయ దేవతలే నా దైవతం,  భారత సంమజం నా బాల్య డోలిక,   యవ్వన నందనవనం! వార్ధక వారణాసి!'    సోదరా యిలా చాటు,   భారత భూమి నా మహోన్నత స్వర్గం,  భారతదేశ శ్రేయమే నా శ్రేయం'.  అహర్నిశలూ యిలా ప్రార్దించు! 'ఓ గౌరీశ్వరా, ఓ లోకేశ్వరా, నాకు మానవత్వాన్ని ప్రసాదించు!  నా దౌర్బల్యాన్ని తొలగించు,, నన్ను ధీర మానవుడిగా తీర్చి దిద్దు!   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి